వారిపై సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయాలి: స్పీకర్ ను కోరిన మంత్రి నాదెండ్ల

Nadendla Manohar fires on YCP members
  • ఓ పార్టీ సభ్యులు అసెంబ్లీ హుందాతనాన్ని దెబ్బతీస్తున్నారన్న మంత్రి నాదెండ్ల
  • ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • స్పీకర్ తీసుకున్న రూలింగ్ పూర్తిగా సమంజసమైనదని వెల్లడి
ఓ పార్టీ సభ్యులు అసెంబ్లీ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఆ పార్టీ సభ్యుల ప్రవర్తనపై సభా హక్కుల కమిటీకి స్పీకర్ ఫిర్యాదు చేయాలని కోరారు. సభా హక్కులను విస్మరించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. సభా హక్కుల కమిటీకి ఈ అంశాన్ని రిఫర్ చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు. 

"సభా హుందాతనాన్ని కాపాడే బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. ఓ పార్టీ సభా నియమాలను దుర్వినియోగం చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. సభాపతి తీసుకున్న నిర్ణయం (రూలింగ్) పూర్తిగా సమంజసమైంది. సభా హక్కుల కమిటీ దీనిపై లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి ఆ పార్టీ కూడా సహకరించాలి, లేకపోతే ప్రజలే వారిని తిరస్కరిస్తారని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక విధ్వంసం నుండి బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను మరోసారి అభివృద్ధి పథంలో నడిపించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి" అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Nadendla Manohar
Janasena
AP Assembly Session
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News