వల్లభనేని వంశీని రెండో రోజూ ప్రశ్నించిన పోలీసులు.. 12న జగన్‌ను కలిసినట్టు అంగీకారం
- సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్
- వరుసగా రెండో రోజూ విచారించిన పోలీసులు
- 12వ తేదీ నాటి కాల్ డేటాను ముందు పెట్టి ప్రశ్నలు
- ఆ రోజున తాను జగన్ ను కలిసినట్టు వంశీ అంగీకారం
- వంశీనే కిడ్నాప్ ప్లాన్ రచించారన్న మరో ఇద్దరు నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి
మరోవైపు, నిన్న రెండో రోజు ఇదే కేసులో అరెస్ట్ అయిన శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని కూడా పోలీసులు విచారించారు. వంశీ ఆదేశాల మేరకు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశామని, హైదరాబాద్, విశాఖపట్నం తీసుకెళ్లామని వారు అంగీకరించినట్టు తెలిసింది. అంతేకాదు, కిడ్నాప్‌కు ప్లాన్ రచించింది వంశీయేనని యతీంద్ర రామకృష్ణ, యర్రంశెట్టి రామాంజనేయులు చెప్పినట్టు సమాచారం. ఈ నెల 10న సత్యవర్ధన్‌ను కోర్టు వద్ద రామాంజనేయులు, వేణు, వేల్పుల వంశీ కలిసి కిడ్నాప్ చేసి నలుపు రంగు కారులో హైదరాబాద్‌లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ వంశీ ఆదేశాలతో అదే కారులో సత్యవర్ధన్‌ను వైజాగ్ తీసుకెళ్లి తొలుత హోటల్‌లో తర్వాత ఓ ఫ్లాట్‌లో ఉంచినట్టు అంగీకరించారు. కాగా, కోర్టు ఆదేశాలతో జైలులో వెస్ట్రన్ కమోడ్, పడుకునేందుకు దిమ్మ ఉన్న సెల్‌కు వంశీని మార్చారు.