నేడు తాడేపల్లికి జగన్
- ఈ రోజు సాయంత్రం 6.25 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్న జగన్
- రోడ్డు మార్గంలో 7.30 గంటలకు తాడేపల్లి నివాసానికి
- రేపు (24వ తేదీ) అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్న జగన్
ఈ రోజు సాయంత్రం 4.20 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ జగన్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4.40 గంటలకు చేరుకుంటారు. 5.25 గంటలకు విమానంలో బయలుదేరి 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.55 గంటలకు విజయవాడ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.
కాగా, రేపు అసెంబ్లీ సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని సమాచారం.
.