అణ్వాయుధాలు మమ్మల్ని రక్షించుకోవడానికే.. భారత్ తో చర్చలకు సిద్ధం: పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్
- అణు యుద్ధం జరిగితే ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ ఉండరన్న పాక్ ప్రధాని
- అణు యుద్ధం జరిగితే విధ్వంసం ఎంత ఘోరంగా ఉంటుందో తమకు తెలుసని వ్యాఖ్య
- ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదన్న షాబాజ్ షరీఫ్
పాకిస్థాన్ ఒక అణ్వాయుధ దేశమని... తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసమేనని, యుద్ధం కోసం కాదని పాక్ ప్రధాని చెప్పారు. ఒకవేళ అణు యుద్ధమే జరిగితే... ఏం జరిగిందో చెప్పడానికి ఆ తర్వాత ఎవరూ మిగిలి ఉండరని అన్నారు. అందువల్ల ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. అణు యుద్ధం జరిగితే దాని విధ్వంసం ఎంత ఘోరంగా ఉంటుందో పాకిస్థాన్ కు తెలుసని... ఇదే విషయాన్ని ఇండియా కూడా గ్రహించాలని చెప్పారు. త్వరలోనే పాకిస్థాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.