Ramcharan: రూ.100 కోట్ల పారితోషికంపై రామ్ చరణ్ స్పందన

Ram Charan Clarity On Rs 100 Crore Remuneration
షార్ట్స్‌లో చూడండి
వరుస సినిమాలతో రామ్ చరణ్ బిజీ బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవితో చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ కూడా ఇప్పటికే జరిగింది.

అయితే, ఆ తదుపరి సినిమాకు సంబంధించి చరణ్ రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానిపై చెర్రీ క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఉన్నా తనకెవరిస్తారంటూ పుకార్లకు చెక్ పెట్టేశాడు.
Go Back to Shorts
Ramcharan
Tollywood
Remuneration
RRR

More Telugu News