తన కార్యాలయంలో చంద్రబాబు ఫొటోను తొలగించిన కేశినేని నాని
- ఇతర ముఖ్య నేతల ఫొటోలు కూడా తొలగింపు
- రతన్ టాటాతో కలిసున్న ఫొటోను ఏర్పాటు చేసిన వైనం
- పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం
విజయవాడ కేశినేని భవన్ లోని ఆయన పార్లమెంటు కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించారు. ఆయనతో పాటు పార్టీలోని మరికొందరు ముఖ్యనేతల ఫొటోలను కూడా పక్కనపెట్టారు. చంద్రబాబు ఫొటో స్థానంలో... రతన్ టాటాతో తాను కలిసున్న ఫొటోను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని టీడీపీ నుంచి వైదొలగేందుకు సిద్ధపడే ఈ పని చేశారని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెపితే ఏ పార్టీలో చేరబోతారనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది.