అమరరాజా పరిశ్రమలో కార్యకలాపాలు పునఃప్రారంభం
- ఇటీవల అమరరాజా పరిశ్రమకు తాత్కాలిక బ్రేక్
- ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు
- హైకోర్టును ఆశ్రయించిన అమరరాజా యాజమాన్యం
- కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులపై హైకోర్టు స్టే
- నిన్నటి నుంచి అమరరాజా యూనిట్లలో కార్యకలాపాలు
పర్యావరణ, భద్రత మరియు ఆరోగ్య వ్యవస్థలకు అత్యధిక ప్రాధాన్యత కొనసాగిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సహకరించి ఏ విధమైనటువంటి సమస్యలనైనా పరిష్కరించే దిశలో సంస్థ తరపున కార్యాచరణ ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. గత కొద్దిరోజులుగా ఉన్న తాత్కాలిక అంతరాయం వల్ల కంపెనీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం లేదని, సంస్థ ఉత్పత్తులను యథావిధిగా అందించగలమని భాగస్వాములందరికీ హమీ ఇచ్చింది.