'సెంటు పట్టా' పేరిట మీ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిపై జవాబు చెప్పండి: సీఎంపై దేవినేని ఉమ ధ్వజం
- ఇళ్ల స్థలాల విషయంలో టీడీపీ విమర్శల దాడి
- రూ.7,500 కోట్లతో ఎక్కడ కొన్నారో వెల్లడించాలన్న ఉమ
- ఇంటి బకాయిలు ఎందుకు చెల్లించలేదంటూ ట్వీట్
ఉపాధి హామీలో రూ.4 వేల కోట్ల విలువైన పనులు ఎక్కడ చేశారు? ఇంటి బకాయిలు రూ.4,300 కోట్లు ఎందుకు చెల్లించడంలేదు? అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఉమ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం కట్టిన ఇళ్లను వదిలేస్తూ, సెంటు భూమి ఇస్తామంటూ జగన్ సర్కారు చెబుతోందని, సెంటు భూమి పట్టాకు రేట్లు కడుతూ వైసీపీ నేతలు దోపిడీకి తెరలేపారని టీడీపీ విమర్శలు చేస్తుండడం తెలిసిందే.