పాకిస్థాన్‌లో హిమపాతం.. ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా టీమ్ గల్లంతు!
- పాకిస్థాన్‌లోని బ్రాడ్ పీక్‌పై విరిగిపడ్డ మంచు చరియలు
- ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు
- గురువారం నాటి ప్రమాదం తర్వాత బృందంతో తెగిపోయిన కమ్యూనికేషన్
- వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్లతో గాలింపు చర్యలు
- గల్లంతైన వారిలో అమెరికా, చైనా, ఒమన్ దేశీయులు
ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్‌కు చెందిన నిర్మల్ పుర్జా నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం పాకిస్థాన్‌లో గల్లంతైంది. ప్రపంచంలోనే 12వ అత్యంత ఎత్తైన పర్వతమైన బ్రాడ్ పీక్‌పై గురువారం భారీ హిమపాతం సంభవించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత బృందంతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని, వారి ఆచూకీ తెలియడం లేదని పాకిస్థాన్ పర్వతారోహణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంతర్జాతీయ బృందంలో ఒక అమెరికన్, ఒక చైనీయుడు, ఒమన్‌కు చెందిన వ్యక్తితో పాటు ఐదుగురు నేపాలీలు ఉన్నారని ‘బీబీసీ’ తన కథనంలో వెల్లడించింది. కారకోరం పర్వత శ్రేణిలో 8,047 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరంపై హిమపాతం తర్వాత బృందం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం ఉదయం హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆల్పైన్ క్లబ్ ఆఫ్ పాకిస్థాన్ వైస్ ప్రెసిడెంట్ కరార్ హైదరీ తెలిపారు.
నిర్మల్ పుర్జా 2019లో కేవలం ఆరు నెలల్లోనే 8,000 మీటర్ల కంటే ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించి ప్రసిద్ధి చెందారు. ఆయన గతంలో బ్రిటిష్ సైన్యంలో, రాయల్ మెరైన్‌లో కూడా పనిచేశారు. పర్వతారోహణకు అత్యంత సవాలు విసిరే శిఖరాలలో బ్రాడ్ పీక్ ఒకటి. పర్వతారోహకులందరూ సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నామని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆల్పైన్ క్లబ్ ఒక ప్రకటనలో పేర్కొంది.