ఫార్ములా-ఈ కేసు: నేడు కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్
- ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో ఏ-1 నిందితుడిగా కేటీఆర్
- రూ. 55 కోట్లు అక్రమంగా మళ్లించారని ప్రధాన అభియోగం
- కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) శుక్రవారం ఉదయం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్నారు. కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. మంత్రివర్గ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రూ. 55 కోట్లను లండన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థకు అక్రమంగా బదిలీ చేశారని ఏసీబీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చి ఈ నిధులు మళ్లించేలా చేశారని ఏసీబీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1గా పేర్కొన్న ఏసీబీ, ఆయనతో పాటు నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి సహా మరికొందరిపై అభియోగాలు మోపింది. విచారణలో భాగంగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు నిందితులంతా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టులు జరగనందున, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.