కూతురి జీతం, కట్నంపై కన్ను.. కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచిన తండ్రి
- బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కూతురిపై తండ్రి హత్యాయత్నం
- పెళ్లి సంబంధం, ఆర్థిక విషయాల్లో విభేదాలే దాడికి కారణం
- వరుడి కుటుంబం నుంచి రూ.40 లక్షలు, కూతురి జీతం డిమాండ్ చేసిన తండ్రి
- పనిచేస్తున్న కాలేజీలోనే కత్తితో దాడి.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కన్న తండ్రే తన కూతురిపై కిరాతకుడిగా మారి, ఆమె పనిచేస్తున్న కాలేజీలోనే కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. పెళ్లి, ఆర్థిక విషయాల్లో తలెత్తిన విభేదాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు రాజనుకుంటేలోని ఎస్‌విఐటి కాలేజీలో లక్ష్మీ దుర్గ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి నాగేంద్ర (54) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జులై 25న మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగేంద్ర, తన కూతురిని కలవాలని చెప్పి కాలేజీకి వచ్చాడు. సిబ్బంది అనుమతించడంతో డిపార్ట్‌మెంట్ హెడ్ క్యాబిన్‌లో కూర్చున్నాడు. తండ్రిని కలవడానికి లక్ష్మీ దుర్గ అక్కడికి రాగానే, అకస్మాత్తుగా కత్తితో ఆమెపై దాడి చేశాడు.
ఈ దాడిలో లక్ష్మీ దుర్గ పొత్తి కడుపు, ఛాతీ, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నాగేంద్ర అక్కడి నుంచి పరారయ్యాడు. కాలేజీ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాజనుకుంటే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించి నాగేంద్రను అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగేంద్ర తన కూతురి కోసం ఒక పెళ్లి సంబంధం చూశాడు. అయితే, కూతురి చదువు కోసం తాను చాలా ఖర్చు పెట్టానని, కాబట్టి తనకు రూ. 40 లక్షలు ఇవ్వాలని వరుడి కుటుంబాన్ని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా, పెళ్లి తర్వాత కూడా లక్ష్మీ దుర్గ నెల జీతం మొత్తం తనకే ఇవ్వాలని షరతు విధించాడు.
ఈ డిమాండ్లను లక్ష్మీ దుర్గ, ఆమె తల్లి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోపం పెంచుకున్న నాగేంద్ర, కూతురిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.