తమ దెబ్బకు మూడు ఎఫ్-35 జెట్లు కూలాయన్న ఇరాన్
- జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై దాడి చేసి ఎఫ్-35 జెట్లు ధ్వంసం చేశామన్న ఇరాన్
- తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయన్న అమెరికా
- యుద్ధం మొదలైనప్పటి నుంచి 42 విమానాలను కోల్పోయినట్లు అంగీకరించిన అమెరికా
- సౌదీ అరేబియా, ఈజిప్టులకు విస్తరిస్తున్న యుద్ధ వాతావరణం
జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై గురువారం బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసి మూడు అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటన చేసింది. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ఈ ప్రకటన విడుదల చేసింది. తమ ఖేషమ్ ద్వీపంపై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగానే జోర్డాన్‌లోని అల్-అజ్రఖ్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ దాడిలో మూడు ఎఫ్-35 విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా, మరో మూడు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. పలువురు అధికారులు, సిబ్బంది కూడా మరణించినట్లు వెల్లడించింది. ఒక్కో ఎఫ్-35 విమానం ఖరీదు 100 మిలియన్ డాలర్లకు పైగా ఉండటంతో, ఇరాన్ ఆరోపణలు నిజమైతే అది అమెరికాకు భారీ నష్టమే అవుతుంది.
అయితే ఇరాన్ వాదనల్లో నిజం లేదని అమెరికా కొట్టిపారేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) స్పందిస్తూ.. "ఇరాన్ దాడుల్లో తమ విమానాలకు ఎలాంటి నష్టం జరగలేదని" స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నామని లేదా అవి లక్ష్యాలను చేరుకోలేకపోయాయని తెలిపింది.
తాజా దాడిలో విమానాలు ధ్వంసం కాలేదని అమెరికా చెబుతున్నప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) నివేదిక ప్రకారం.. ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగంగా అమెరికా ఇప్పటివరకు 42 విమానాలను కోల్పోయింది లేదా అవి దెబ్బతిన్నాయి. వీటిలో ఎఫ్-15, ఒక ఎఫ్-35ఏ, ఏ-10 థండర్‌బోల్ట్ వంటి యుద్ధ విమానాలతో పాటు 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూడా ఉన్నాయి.
ఈ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత విస్తరిస్తోంది. ఇరాన్ మద్దతున్న మిలీషియాలపై అమెరికాతో కలిసి సౌదీ అరేబియా దాడులు చేయగా, ఈజిప్టులోని ఓడరేవుపై డ్రోన్ దాడి జరిగింది. తమకు వ్యతిరేకంగా సైనిక స్థావరాలను ఉపయోగించుకోవద్దని బల్గేరియా, సైప్రస్ దేశాలను ఇరాన్ హెచ్చరించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.