ఇంటింటికి తెలుగుదేశం-2026 కార్యక్రమం నాలుగో రోజూ విజయవంతం

Telugu Desam Party Intintiki Telugu Desam 2026 program successful on fourth day
  • రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 9 లక్షల ఇళ్లను సందర్శించిన పార్టీ శ్రేణులు
  • కార్యకర్తలను అభినందిస్తున్న మంత్రి నారా లోకేష్
  • ఎస్సెమ్మెస్‌లు పంపిస్తూ, నేరుగా ఫోన్‌లో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్న లోకేష్
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ఇంటింటికి తెలుగుదేశం–2026" కార్యక్రమం నాలుగో రోజూ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గడప గడపకూ వెళ్లి ప్రజలను కలిసి, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. నాలుగో రోజున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించగా, గత నాలుగు రోజుల్లో మొత్తం 9 లక్షల ఇళ్లకు చేరుకుని ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి కీలక రంగాల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని పార్టీ ప్రతినిధులు ప్రజలకు వివరించారు. "ఇంటింటికి తెలుగుదేశం-2026" కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరవవుతున్న నాయకులను, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపడంతో పాటు, పలువురు నాయకులు, కార్యకర్తలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలియజేస్తున్నారు. లోకేష్ స్వయంగా సంప్రదిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనడం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కురవడంతో స్వల్పంగా అంతరాయం కలిగినప్పటికీ, మెజారిటీ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాయి. రానున్న రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో ప్రతి ఇంటికీ చేరుకుని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
Advertisement
Telugu Desam Party
Nara Lokesh
Intintiki Telugu Desam 2026
Andhra Pradesh Welfare Schemes

More Telugu News