భారత్ లో మా భద్రతపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే...!: పాకిస్థాన్ జట్టు కొత్త మెలిక
- భారత్ లో వరల్డ్ కప్ టోర్నీ
- పాకిస్థాన్ జట్టు పాల్గొనడంపై సందిగ్ధత
- ఇటీవలి వరకు ప్రభుత్వం అనుమతించాల్సి ఉందన్న పాక్ బోర్డు
- ఇప్పుడు భద్రతా అంశంపై ఐసీసీకి లేఖ
భారత్ లో వరల్డ్ కప్ అక్టోబరు 5న ప్రారంభమై నవంబరు 19తో ముగియనుంది. అక్టోబరు 14న దాయాదుల మ్యాచ్ జరగనుంది. ఈ మహా సమరానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. అయితే ఇక్కడ్నంచి మ్యాచ్ వేదిక మార్చాలని తొలుత డిమాండ్ చేసిన పాక్ ఆ తర్వాత పట్టువిడుపు ప్రదర్శించింది. ఇప్పుడు భద్రత పేరుతో మరోసారి సందిగ్ధతకు తెరలేపింది.
పాక్ ప్రభుత్వం, అక్కడి క్రికెట్ బోర్డు వైఖరి చూస్తుంటే ఆ జట్టు భారత్ కు రావడంపై అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. తాజా లేఖపై ఐసీసీ స్పందించాల్సి ఉంది.