ప్రపంచ కప్‌లో భారత్‌తో మ్యాచ్ షెడ్యూల్ మార్పునకు ఒప్పుకున్న పాకిస్థాన్ బోర్డు!
- అక్టోబర్15కు బదులు అక్టోబర్14న జరగనున్న దాయాదుల పోరు
- హైదరాబాద్‌లో అక్టోబర్12న శ్రీలంక–పాక్ మ్యాచ్ ఆ నెల 10కి మార్పు
- సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్న ఐసీసీ
దీనివల్ల భారత్‌తో కీలకమైన మ్యాచ్‌కు సన్నద్ధం అయ్యేందుకు పాకిస్థాన్ జట్టుకు తగినంత సమయం లభించనుంది. ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 14న రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రోజు చెన్నైలో బంగ్లాదేశ్–న్యూజిలాండ్, ఢిల్లీలో ఆఫ్ఘానిస్థాన్–ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. భారత్–పాక్ పోరు షెడ్యూల్ మార్పు కారణంగా ఈ రెండింటిలో ఒక మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా అక్టోబర్ 13నే నిర్వహించే అవకాశం ఉంది. ఈ వారాంతంలోగా సవరించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించనుంది