నేనైతే ఎక్కువ డబ్బులు అడిగేవాడిని: భారత్-పాక్ మ్యాచ్‌పై క్రిస్ గేల్
- భారత్-పాక్ మ్యాచ్ పైసా వసూల్ గేమ్ అన్న విండీస్ ప్లేయర్
- ఈ రెండు జట్ల ద్వారా ఐసీసీ ఈవెంట్ ఖర్చు వెళ్లిపోతుందని వ్యాఖ్య
- పాక్, భారత ఆటగాళ్లు అధిక డబ్బులు డిమాండ్ చేయాలని సూచన
ఈ రెండు జట్లు ఆడినప్పుడల్లా.. ముఖ్యంగా ప్రపంచ కప్ లో వారి ఆదాయం ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఈ ఒక్క గేమ్ ద్వారా ఐసీసీ ఈవెంట్ కు అయ్యే ఖర్చు వస్తుందన్నాడు. పాక్, భారత్ ఆటగాళ్లు ఎక్కువ డబ్బును డిమాండ్ చేయాలని, ఎందుకంటే ఆ గేమ్ ల ద్వారా అధిక ఆదాయం వస్తుందన్నాడు. తాను ఐసీసీ లేదా ఆ దేశానికి సంబంధించిన బోర్డును నియంత్రించనని, కాని పాక్, భారత ఆటగాళ్ల స్థానంలో తాను ఉంటే అధిక డబ్బులు డిమాండ్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు.
భారత్ తో పాటు విండీస్ చాలాకాలంగా ఐసీసీ ట్రోఫీని గెలవలేదని, తాము చివరగా 2016లో గెలిచామని గుర్తు చేసుకున్నాడు. అయితే స్వదేశంలో ఆడుతున్నందున భారత్ ఫేవరేట్ గా చెప్పాడు.