ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు.. ట్విట్టర్లో మోదీ శుభాకాంక్షలు
- కేంద్రమంత్రులతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్
- రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైసీపీ కార్యకర్తల సంబరాలు
- నియోజకవర్గాల్లో రక్త దాన, అన్నదాన శిబిరాల ఏర్పాటు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఏపీ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సీఎం బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుతూ నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు, స్కూలు విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.