20 లక్షల జీతం పెంపు.. తిరస్కరించిన 31 ఏళ్ల టెక్కీ.. ఎందుకో తెలుసా?
- ప్రస్తుతం అతడి వార్షిక జీతం రూ.45 లక్షలు
- ప్రమోషన్‌తో రూ.65 లక్షలకు పెరగనున్న వేతనం
- అధిక పని ఒత్తిడి కారణంగా ఆఫర్‌కు ‘నో’
- కుటుంబం, వ్యక్తిగత సమయానికే ప్రాధాన్యం
- టెక్కీ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు
ఏడాదికి రూ.45 లక్షల జీతం. ప్రమోషన్ వస్తే జీతం రూ.65 లక్షలకు పైగానే. అంటే ఏకంగా రూ.20 లక్షల అదనపు ఆదాయం. ఇంత భారీ హైక్‌ను సాధారణంగా ఎవరూ వదులుకోరు. కానీ బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. డబ్బు కంటే తన వ్యక్తిగత జీవితం ముఖ్యమని భావించాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ ‘యూఎబిలిటీ’ వ్యవస్థాపకుడు రోహన్ ధావన్ తన స్నేహితుడి అనుభవాన్ని లింక్డిన్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం అతడు ఏడాదికి రూ.45 లక్షలు సంపాదిస్తున్నాడు. ప్రమోషన్ తర్వాత రూ.65 లక్షలకు పైగా జీతం వస్తుందని కంపెనీ ఆఫర్ చేసింది. ఉన్నత హోదాతో పాటు పెద్ద టీమ్ బాధ్యతలు కూడా అప్పగించనుంది.
అయితే ఈ ప్రమోషన్‌తో అదనపు బాధ్యతలు భారీగా పెరుగుతాయని అతడు భావించాడు. వారంలో నాలుగు రాత్రులు అమెరికా టీమ్‌తో కాన్ఫరెన్స్ కాల్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేయాలి. ప్రస్తుతం ఉన్న టీమ్ కంటే దాదాపు రెండింతల మంది బాధ్యత తీసుకోవాలి. వీకెండ్లు కూడా పూర్తిగా వ్యక్తిగత సమయంగా ఉండకపోవచ్చని తెలిసింది.
వచ్చే ఏడాది పిల్లల కోసం దంపతులు ప్రణాళికలు వేసుకుంటున్నారని రోహన్ తెలిపారు. ఆ టెక్కీ వారంలో ఐదు రోజులు ఉదయాన్నే వ్యాయామం చేస్తాడు. ప్రతి బుధవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తాడు. ప్రమోషన్ తీసుకుంటే ఈ వ్యక్తిగత సమయం తగ్గిపోతుందని భావించి భారీ హైక్‌ను వదులుకున్నాడు.
అయితే అతడి నిర్ణయం తండ్రిని ఆశ్చర్యానికి గురి చేసింది. రూ.20 లక్షల అదనపు జీతాన్ని ఎందుకు వదులుకుంటున్నావని ప్రశ్నించినట్లు రోహన్ తెలిపారు. చిన్నపాటి హైక్‌ల కోసమే ఉద్యోగాలు మారే రోజుల్లో ఇంత పెద్ద మొత్తాన్ని తిరస్కరించడం ఆయనకు అర్థం కాలేదట.
ఒక స్థాయికి చేరిన తర్వాత అదనపు డబ్బు కోసం చెల్లించే మూల్యం సమయం, కుటుంబ బంధాలు, వ్యక్తిగత జీవితం రూపంలో ఉంటుందని రోహన్ అభిప్రాయపడ్డారు. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. కెరీర్ ఎదుగుదల అంటే కేవలం జీతం పెరగడం మాత్రమే కాదని పలువురు వ్యాఖ్యానించారు. జీవితంలో ప్రాధాన్యాలు మారుతుంటాయని, డబ్బుతో పాటు సమయానికి కూడా విలువ ఇవ్వాలని పేర్కొన్నారు.