హైదరాబాద్‌లో భూమి ధరల కొత్త రికార్డు.. ఎకరం రూ.269 కోట్లు!
- హైదరాబాద్ రాయదుర్గంలో మరోసారి భూముల రికార్డు ధర
- ఎకరం రూ. 269 కోట్లకు పలికిన ప్రభుత్వ భూమి
- భూమిని దక్కించుకున్న వంశీరాం బిల్డర్స్
- ఈ వేలంతో ప్రభుత్వానికి రూ. 1,447 కోట్ల ఆదాయం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి సరికొత్త రికార్డును సృష్టించాయి. రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఎకరం ధర ఏకంగా రూ. 269 కోట్లు పలికింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరాం బిల్డర్స్ ఈ భూమిని అత్యధిక ధరకు దక్కించుకుంది.
రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 పరిధిలోని 5.38 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వేలానికి ఉంచింది. దీనికి ఎకరానికి రూ. 175 కోట్లను ప్రభుత్వం కనీస ధరగా నిర్ణయించింది. అయితే, ఆన్‌లైన్ వేలంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ధర అనూహ్యంగా పెరిగింది. చివరికి ఎకరం రూ. 269 కోట్ల చొప్పున వంశీరాం బిల్డర్స్ ఈ స్థలాన్ని కైవసం చేసుకుంది. ఈ విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1,447 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.
వారం రోజుల క్రితమే ఈ ప్రాంతానికి సమీపంలోని మరో ప్లాట్ ఎకరం రూ. 264 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించగా, తాజా వేలం ఆ రికార్డును అధిగమించింది. రాయదుర్గం పరిసరాల్లో గత కొంతకాలంగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఎకరం ధర రూ. 177 కోట్లు ఉండగా, ఈ ఏడాది మే నెలలో అది రూ. 237 కోట్లకు చేరింది. తాజాగా ఈ ధర రూ. 269 కోట్ల మైలురాయిని చేరుకోవడం గమనార్హం.
హైదరాబాద్ ఐటీ హబ్, గచ్చిబౌలి, నాలెడ్జ్ సిటీ వంటి కీలక ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండటంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ గిరాకీని ఆదాయంగా మార్చుకునే క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న భూముల వేలానికి రియల్ ఎస్టేట్ రంగం నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది.