చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట.. అమెరికా ప్రయాణానికి ఓకే
- లిక్కర్ స్కామ్ నిందితుడు చెవిరెడ్డికి అమెరికా వెళ్లేందుకు అనుమతి
- వైద్య చికిత్స కోసం వెళ్తున్నట్లు వెల్లడి
- షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
- సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు ప్రయాణానికి అవకాశం
- ఇదే కేసులో మరో నిందితుడు కారుమూరి సునీల్ రిమాండ్ పొడిగింపు
మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లేందుకు ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 13వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతంలోనూ వైద్యం కోసం అమెరికా వెళ్లిన చెవిరెడ్డి, తాజాగా మరోసారి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పలు నిబంధనలు విధించింది. అమెరికాలో తాను బస చేసే చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను తప్పనిసరిగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ప్రయాణానికి ముందుగానే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అవసరమైన సెక్యూరిటీలను కోర్టులో సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే, అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే తన పాస్‌పోర్టును న్యాయస్థానానికి అప్పగించాలని నిబంధన విధించింది.