ఎస్‌సీఓ సదస్సు వేదికగా దాయాది చిల్లర చేష్ట... గ్రూప్ ఫోటోలో మోదీని క్రాప్ చేసిన పాక్
- ఎస్సీఓ సదస్సు గ్రూప్ ఫోటోలో మోదీని తొలగించిన పాక్
- క్రాప్ చేసిన ఫోటోను షేర్ చేసిన పాకిస్థాన్ పీఎంఓ
- ఇది పాక్ చిల్లరబుద్ధికి నిదర్శనమంటూ నెటిజన్ల విమర్శలు
- పాక్ ప్రధానితో ఉన్న పూర్తి ఫోటోను పంచుకున్న భారత్
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ తన సంకుచిత మనస్తత్వాన్ని మరోసారి చాటుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తీసిన సామూహిక గ్రూప్ ఫోటో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించి (క్రాప్ చేసి) ఆ దేశం ప్రచురించింది. ఈ చర్యపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశంలో సభ్య దేశాల నేతలందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అయితే, ఈ ఫోటోను పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకునే క్రమంలో, అందులో ఉన్న భారత ప్రధాని మోదీని కత్తిరించి పక్కనపెట్టింది. కేవలం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర నేతలు ఉన్న భాగాన్ని మాత్రమే ప్రచురించింది.
మరోవైపు, భారత్ మాత్రం ఈ విషయంలో ఎంతో హుందాగా వ్యవహరించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా నేతలందరూ ఉన్న పూర్తి ఫోటోను అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు ఫోటోలను పోలుస్తూ నెటిజన్లు పాకిస్థాన్ తీరుపై మండిపడుతున్నారు. ఇది పాక్ ప్రదర్శించిన సంకుచిత వైఖరి అని, వారి దిగజారుడు మనస్తత్వానికి ఇది నిదర్శనమని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాక్ ప్రధాని కార్యాలయం పంచుకున్న ఫొటో..

ప్రధాని మోదీ కార్యాలయం పంచుకున్న ఫొటో