ఏపీ లిక్కర్ స్కాం... రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
- సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం
- నిందితుడు కస్టడీలో ఉండగా ప్రొడక్షన్ వారెంట్ ఎందుకని సిట్‌కు ప్రశ్న
- ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనుసరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి (రాజ్ కెసిరెడ్డి) అరెస్టును, రిమాండ్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం, సిట్ దర్యాప్తు శైలిని తప్పుబట్టింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ దశలో ఉండగా, మరో కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి ప్రొడక్షన్ వారెంట్ కోరాల్సిన అవసరం ఏముందని సిట్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. నిందితుడు పారిపోయే అవకాశం లేనప్పుడు ఇటువంటి చర్యలు ఎందుకని నిలదీసింది. విచారణ నిమిత్తం ప్రొడక్షన్ వారెంట్ పొంది, అనంతరం పోలీస్ కస్టడీకి తీసుకోకుండా తిరిగి జ్యుడీషియల్ కస్టడీని కోరడంలో ఉన్న వైరుధ్యాన్ని కోర్టు ఎత్తిచూపింది.
గతంలో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, నిందితుడిని అరెస్టు చేసేటప్పుడు అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని, ఇది కేవలం నామమాత్రపు ప్రక్రియ కాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను సిట్ పాటించని కారణంగా కేసిరెడ్డి అరెస్టును చట్టవిరుద్ధంగా పరిగణిస్తూ రద్దు చేసింది. అయితే, కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని, దర్యాప్తునకు కెసిరెడ్డి సహకరించాలని కోర్టు ఆదేశించింది.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుగా వ్యవహరించిన కెసిరెడ్డిని ఏపీ సీఐడీకి చెందిన సిట్ 2025లో అరెస్టు చేసింది. హైకోర్టు ఆయనకు ఏప్రిల్ 2026లో బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు ఇస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.