మంత్రి విడదల రజనిని అభినందించిన సీఎం జగన్
- ఏపీ వైద్య ఆరోగ్యశాఖకు జాతీయ గుర్తింపు
- టెలీ కన్సల్టేషన్, విలేజ్ హెల్త్ క్లినిక్ అంశాల్లో అవార్డులు
- ఇటీవల అవార్డులు అందుకున్న రజని, ఎం.టి.కృష్ణబాబు
- సీఎం జగన్ కు అవార్డులు చూపించిన రజని, కృష్ణబాబు
ఈ నేపథ్యంలో, మంత్రి విడదల రజని, ఎం.టి.కృష్ణబాబు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు లభించిన అవార్డులను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రి రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించారు. మున్ముందు కూడా ఇదే తరహా పనితీరు కనబర్చాలని సూచించారు.