ఆ ఇళ్లనే ఇవ్వలేని జగన్ సర్కారు.. 25 లక్షల ఇళ్లను ఎలా ఇస్తుంది?: గద్దె రామ్మోహన్
- టీడీపీ హయాంలో కట్టిన వాటినే ఇవ్వలేకపోతోంది
- అప్పట్లో ఇళ్ల కోసం జనాలు రూ. 25 వేలు కట్టారు
- ఇప్పుడు మరో 75 వేలు కట్టాలని అధికారులు ఫోన్లు చేస్తున్నారు
టీడీపీ హయాంలో రూ. 25 వేలు కట్టినవారు ఇప్పుడు మరో రూ. 75 వేలు కడితే ఇల్లు ఇస్తామని చెపుతున్నారని... ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ. 75 వేలు కట్టాలంటూ విజయవాడలో చాలా మందికి అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఈరోజు ఆయన మరో టీడీపీ నేత నాగుల్ మీరాతో కలిసి టిడ్కో ఎండీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.