వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల చరిత్రలు ఇవే.. అదొక బిస్కెట్ పార్టీ: వర్ల రామయ్య
- మోపిదేవి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారు
- అయోధ్య రామిరెడ్డిపై 10 కేసులు ఉన్నాయి
- పరిమళ్ నత్వానీ అంబానీకి చెందిన వ్యక్తి
పెద్దల సభకు ఇలాంటి వ్యక్తులను కాకుండా మంచివాళ్లను పంపించాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నానని వర్ల చెప్పారు. రాజ్యసభ పోటీలో తాను కూడా ఉన్నానని... తనకు ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదని... పేద, బడుగు, బలహీనవర్గాల వాణిని రాజ్యసభలో బలంగా వినిపిస్తానని అన్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయం మేరకు కాకుండా, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో జగన్ పై విమర్శలు గుప్పించారు. రెండు సీట్లను బీసీలకు ఇచ్చేబదులు... ఒక సీటును ఎస్సీకి ఇవ్వచ్చుకదా అని అన్నారు. ఈ విషయాన్ని ఎస్సీ ఎమ్మెల్యేలు జగన్ ను ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ ఒక బిస్కెట్ పార్టీ అని ఎద్దేవా చేశారు.