- చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళుతున్న ఎంవీ స్టార్ లైన్ అనే నౌకను సీజ్ చేసిన ఇండోనేషియా నేవీ
- నౌకలో 100 క్షిపణుల ఇంధనం తయారు చేసేందుకు సరిపడా 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ లభ్యం
- రసాయనంతో పాటు 54 ప్యాలెట్లలో లక్షలాది రిజిస్టర్ కాని 4G సిమ్ కార్డుల గుర్తింపు
చైనా నుంచి బంగ్లాదేశ్‌కు భారీ ఎత్తున రాకెట్, క్షిపణి ఇంధన తయారీకి ఉపయోగించే ప్రమాదకర రసాయనాలను తరలిస్తున్న ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌకను ఇండోనేషియా నౌకాదళం అదుపులోకి తీసుకుంది. ఉత్తర సుమత్రాలోని బెలవాన్ తీరంలో ‘ఎంవీ స్టార్ లైన్’ అనే నౌకను సోదాలు చేయగా, ఏకంగా 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ రసాయనంతో పాటు లక్షలాది రిజిస్టర్ కాని 4G ఎల్టీఈ సిమ్ కార్డులు బయటపడ్డాయి.
ఇండోనేషియా నౌకాదళ పెట్రోలింగ్ నౌక కేఆర్ఐ సిగలు-857 గస్తీ కాస్తుండగా, ‘ఎంవీ స్టార్ లైన్’ నౌక రాకపోకలపై అధికారులకు అనుమానం వచ్చింది. నౌక నిర్దేశిత సముద్ర మార్గంలో కాకుండా వేరే వైపు వెళ్లడం, రేడియో సంకేతాలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. నౌకలోని మొత్తం 36 కంటైనర్లలో 15 కంటైనర్లలో ఈ రసాయనాన్ని గుర్తించారు. అలాగే మరో 54 ప్యాలెట్లలో లెక్కలేనన్ని బ్లాంక్ సిమ్ కార్డులు ఉన్నట్లు తేలింది.
నౌకలో పట్టుబడిన సోడియం పెర్క్లోరేట్ పరిమాణంతో దాదాపు 100 క్షిపణులకు సరిపడా ఇంధనం తయారు చేయవచ్చని నేవల్ రీజినల్ కమాండ్-1 అధికారి రియర్ అడ్మిరల్ డెన్నీ సెప్టియానా తెలిపారు. నౌక పత్రాలను పరిశీలించగా దాని రిజిస్ట్రేషన్ స్టేటస్ ఇప్పటికే సస్పెండ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. అంత ప్రమాదకరమైన కెమికల్ కన్సైన్మెంట్ను బంగ్లాదేశ్‌లో ఎవరు ఆర్డర్ చేశారు, దీని అసలు గమ్యస్థానం ఎక్కడిది అనే వివరాలపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ నౌకను స్వాధీనం చేసుకున్న ఇండోనేషియా అధికారులు, సిబ్బందిని అదుపులోకి తీసుకుని వివిధ ఏజెన్సీలతో కలిసి లోతైన విచారణ జరుపుతున్నారు.