- ఇంజినీరింగ్ కనీస ఫీజు రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంపు
- ప్రభుత్వానికి, మంత్రి లోకేశ్‌కు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం కృతజ్ఞతలు
- రెండు నెలల్లో కొత్త బ్లాక్ పీరియడ్ పూర్తి ఫీజుల ఖరారు
- నెలకు రూ.400 కోట్ల రీయింబర్స్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి
- విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయవద్దని కాలేజీలకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల కనీస ఫీజును ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు రూ. 40,000గా ఉన్న కనీస వార్షిక ఫీజును రూ. 47,000కు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తాత్కాలిక ఫీజు పెంపు నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం (అపెక్మా) స్వాగతించింది. ఇంజినీరింగ్ కళాశాలల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఫీజును సవరించినందుకు కూటమి ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అపెక్మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. రాబోయే 2026–29 కొత్త బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన పూర్తి ఫీజుల వివరాలను రానున్న రెండు నెలల్లో ప్రభుత్వం ఖరారు చేయనుందని యాజమాన్యాలు తెలిపాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల ప్రక్రియపైనా అపెక్మా కీలక విషయాలను వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రీయింబర్స్‌మెంట్ బకాయిల కింద సుమారు రూ. 5,000 కోట్లను విడుదల చేసిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రతినెలా రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు విడుదలవుతుండగా, ఈ మొత్తాన్ని రూ. 400 కోట్లకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 1,800 కోట్లకు ప్రొసీడింగ్స్ జారీ కాగా, అందులో ఇప్పటికే రూ. 1,000 కోట్లు విడుదలయ్యాయని తెలిపింది. మిగిలిన రూ. 800 కోట్లు రాబోయే రెండు మూడు నెలల్లో క్లియర్ అవుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2026–27 విద్యా సంవత్సరానికి చెందిన కనీసం 50 శాతం నిధులను విడుదల చేయాలని కోరినట్లు అసోసియేషన్ పేర్కొంది. విద్యార్థులకు నేరుగా ఎంటీఎఫ్ (మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు) నిధులను జమ చేసే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వివరించింది.
అదే సమయంలో, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు అపెక్మా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తి చేసుకున్న చివరి సంవత్సరం విద్యార్థుల సర్టిఫికెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రొసీడింగ్స్ జారీ అయినప్పటికీ సర్టిఫికెట్ల జారీలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు నేరుగా తమను సంప్రదించవచ్చని సూచించింది. హాస్టల్ లేదా రవాణా ఫీజుల పేరిట ప్రవేశాలను నిరాకరించవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన కనీస ఫీజుతోనే అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించింది. అడ్మిషన్లు ఆలస్యం కావడం లేదా హాజరు నమోదు సమస్యల వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత కోల్పోయిన విద్యార్థుల వివరాలను వెంటనే సరిచేసి రెగ్యులరైజ్ చేయాలని కాలేజీలకు స్పష్టం చేసింది.