- ఏపీ నుంచి తెలంగాణలోని అశ్వారావుపేట అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన పెద్దపులి
- రేడియో కాలర్ జీపీఎస్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను ట్రాక్ చేస్తున్న అధికారులు
- తెలంగాణలోకి రాకముందు ఏపీలోని వేలేరుపాడు మండలంలో నాలుగు ఆవులను చంపిన పులి
ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతం నుంచి ఓ పెద్దపులి సరిహద్దు దాటి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోకి ప్రవేశించింది. ఆహారం కోసం అన్వేషిస్తూ వచ్చిన ఈ పెద్దపులి సంచారంతో సరిహద్దు గ్రామాలు, గిరిజన తండాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ పులికి గతంలోనే రేడియో కాలర్ (జీపీఎస్ ట్రాకర్) అమర్చడంతో దాని కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పులి... కవాడిగుండ్ల, చెన్నపురం, బచ్చువారిగూడెం అటవీ ప్రాంతాల మీదుగా గాండ్లగూడెం పరిసరాల్లోకి చేరుకున్నట్లు గుర్తించారు. "పులి తెలంగాణ అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు ఏపీ అధికారులు సమాచారం ఇచ్చారని ఫారెస్టు రేంజర్ మురళీకృష్ణ తెలిపారు." తెలంగాణలోకి అడుగుపెట్టడానికి ముందు ఏపీలోని వేలేరుపాడు మండలంలో ఈ పులి నాలుగు ఆవులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు.
పులి సంచారం దృష్ట్యా తెలంగాణ అటవీశాఖ అశ్వారావుపేట మండలంలో హై అలర్ట్ ప్రకటించింది. గొల్లమడుగు, కవాడిగుండ్ల, హెచ్.వారిగూడెం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి పెట్రోలింగ్ ముమ్మరం చేసింది. పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చీకటి పడిన తర్వాత ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని మైకుల ద్వారా దండోరా వేయిస్తూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపడుతూనే, పులిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.