- ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాల గడువు 2031 వరకు పొడిగింపు
- ముద్ర క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌కు రూ. 5,000 కోట్ల కేటాయింపు
- మహిళలు, ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు స్టాండ్-అప్ ఇండియా కింద ప్రోత్సాహం
- ముద్ర రుణాలపై వార్షిక గ్యారెంటీ ఫీజు 0.75 శాతానికి తగ్గింపు
చిన్న, సూక్ష్మ వ్యాపారులు, మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాల పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, రెండు ముఖ్యమైన పథకాల గడువును మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద అమలు చేస్తున్న క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్ఎంయూ), స్టాండ్-అప్ ఇండియా పథకాలను 2031 మార్చి 31 వరకు కొనసాగించేందుకు ఆమోదముద్ర వేసింది. షూరిటీ లేకుండా రుణాలు అందించి, కొత్త తరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం.
ఈ పొడిగింపులో భాగంగా, ముద్ర యోజన కింద రుణ హామీ కోసం రూ. 5,000 కోట్ల కార్పస్‌ను కేబినెట్ ఆమోదించింది. దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు రూ. 12.6 లక్షల కోట్ల విలువైన రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇకపై సూక్ష్మ పరిశ్రమలకు రూ. 20 లక్షల వరకు, జన్ ధన్ ఖాతాల్లో రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యానికి, స్వయం సహాయక బృందాలకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య రుణాలకు కూడా గ్యారెంటీ వర్తిస్తుంది. లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ముద్ర రుణాలపై వార్షిక గ్యారెంటీ ఫీజును ఒక శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించారు.
అదేవిధంగా, స్టాండ్-అప్ ఇండియా పథకాన్ని కూడా 2031 వరకు పొడిగించారు. దీనికోసం రూ. 4,111 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ నిధిని కేటాయించారు. ఈ పథకం కింద మహిళలు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు చెందిన వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు అందిస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే 2.75 లక్షల మంది లబ్ధి పొందగా, రాబోయే ఐదేళ్లలో మరో 2.5 లక్షల మందికి చేయూత అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరిస్తూ.. ఈ చర్యల వల్ల రుణాలిచ్చే సంస్థలపై భారం తగ్గుతుందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న వర్గాలను ప్రోత్సహించి, వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.