Advertisement

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్

Telangana
Advertisement
  • మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ పర్యటన
  • వడ్డేపల్లిలోని నివాసంలో దాస్యం వినయ్ భాస్కర్‌ను నిర్బంధించిన పోలీసులు
  • వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాస్యం వినయ్ భాస్కర్‌ను ఈ ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హనుమకొండ వడ్డేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయన బయటకు రాకుండా నిర్బంధించారు.

కాజీపేట పరిధిలోని వైఎస్సార్ నగర్ నివాసితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో వినయ్ భాస్కర్ స్పందిస్తూ... "వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు న్యాయం చేయకపోతే భట్టి పర్యటన అడ్డుకుంటాం. పట్టాలపై స్పష్టమైన ప్రకటన చేయాలి.. లేదంటే నిరసన తప్పదు" అని స్పష్టం చేశారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. వినయ్ భాస్కర్ ఇంటి వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, స్థానికంగా ఉన్న పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Dasyam Vinay BhaskarBRS Leader House ArrestBhatti Vikramarka Hanumakonda VisitKazipet YSR Nagar Land Titles

More Telugu News

హీరో రణ్ వీర్ సింగ్ కుటుంబంలో విషాదం

11 Nov, 11:03

బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే అరుదైన మైలురాయి!

11 Nov, 11:01

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ బస్‌ స్టేషన్లలో ఫ్రీ వైఫై!

11 Nov, 11:00

బాధ్యతగల ఓ బ్యాంకు ఉద్యోగి నిర్లక్ష్యం.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది: సజ్జనార్

11 Nov, 10:57

పసిడి ధరల్లో తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..!

11 Nov, 10:54

‘నిరక్షరాస్యుడు’ అంటూ ప్రయాణికుడిపై జులుం.. మహిళా టీటీఈ సస్పెన్షన్

11 Nov, 10:51

అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు కదా.. మరి బరువు ఎలా కొలుస్తారు?

11 Nov, 10:25

టాక్సిక్' చిత్రంలో రొమాంటిక్ సీన్స్.. కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మద్దతు

11 Nov, 10:23

పేదలకు ఏపీ సర్కార్ ఊరట.. 3 నెలల పాటు రాయితీపై నిత్యావసరాలు

11 Nov, 10:21

టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల చరిత్రలో తొలిసారి!

11 Nov, 10:20

పండుగ రోజున చీకటి గదిలో.. కన్నీళ్లు పెట్టించిన నటి జీవా దీపావళి!

11 Nov, 10:11

అసోంలోని దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్

11 Nov, 10:08

అఫీషియల్‌: అర్ష్‌దీప్‌, హార్దిక్‌ ట్రేడ్‌ పూర్తి.. పారితోషికం ఎంతంటే..!

11 Nov, 10:06

వేసవి వేడిని నిల్వ చేసి చలికాలంలో వెచ్చదనం.. ఫిన్లాండ్ వినూత్న ప్రయోగం

11 Nov, 10:04
..More Telugu News