- ఆటగాడి నుంచి కామెంటేటర్‌గా మారిన తన ప్రయాణాన్ని వివరించిన రవిశాస్త్రి
- ఆటపై పిచ్చి ఉంటేనే ఈ రంగంలో దశాబ్దాల పాటు రాణించగలమని స్పష్టీకరణ
- లెజెండరీ కామెంటేటర్ రిచీ బెనాడ్ ఇచ్చిన సలహాను గుర్తుచేసుకున్న వైనం
- టీవీలో చిత్రానికి అదనంగా చెప్పగలిగితేనే మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండాలన్న బెనాడ్
- రిచీ బెనాడ్, ఇయాన్ చాపెల్ వంటి దిగ్గజాల నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడి
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్, ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ కామెంటేటర్లలో ఒకరిగా కొనసాగుతున్న రవిశాస్త్రి.. తన కెరీర్ ప్రయాణంలోని కీలక ఘట్టాలను పంచుకున్నాడు. ఆటగాడిగా, కోచ్‌గా రాణించిన తర్వాత కామెంటరీ బాక్స్‌లోకి అడుగుపెట్టడం తనకెంతో ఇష్టమైన క్రికెట్‌తో బంధాన్ని కొనసాగించేందుకు సహజంగానే జరిగిందని తెలిపాడు. ఈ రంగంలో దశాబ్దాల పాటు కొనసాగాలంటే కేవలం ఉద్యోగంగా కాకుండా, ఆటపై విపరీతమైన అభిరుచి, ప్రేమ ఉండాలని స్పష్టం చేశాడు.
'స్కై స్పోర్ట్స్' ప్రతినిధి ఇయాన్ స్మిత్‌తో జరిపిన సంభాషణలో శాస్త్రి తన కామెంటరీ కెరీర్ తొలిరోజుల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. "జీవితం మనల్ని వివిధ మార్గాల్లోకి తీసుకెళ్లడం ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ జీవితం మమ్మల్ని పూర్తిగా ఆవహించింది. ఆటపై ప్రేమ, అభిరుచి లేకపోతే ఇన్నేళ్లు ఈ రంగంలో ఉండలేం. ప్రతి మ్యాచ్‌కు అదే ఉత్సాహాన్ని ప్రదర్శించడం సాధ్యం కాదు" అని వివరించాడు. మేజర్ టోర్నీల ఫైనల్స్‌కు కామెంటరీ చెప్పడం గొప్ప గౌరవమని, తోటి కామెంటేటర్లతో మంచి సమన్వయం, పరస్పర గౌరవం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని అన్నాడు.
1994లో తన బ్రాడ్‌కాస్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిన రవిశాస్త్రి, దిగ్గజాల నుంచి నేర్చుకోవడం వల్లే తాను ఈ స్థాయిలో నిలబడ్డానని తెలిపాడు. "ఇయాన్ చాపెల్, డేవిడ్ గోవర్, జెఫ్రీ బాయ్‌కాట్, టోనీ గ్రెయిగ్, రిచీ బెనాడ్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ముఖ్యంగా రిచీ బెనాడ్, టోనీ గ్రెయిగ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆటను ఎలా మార్కెట్ చేయాలో గ్రెయిగ్ నేర్పిస్తే, బ్రాడ్‌కాస్టింగ్‌లో క్రమశిక్షణ ఎలా ఉండాలో రిచీ బెనాడ్ చూపించారు. ఇయాన్ చాపెల్ నిర్మొహమాటంగా మాట్లాడే తీరు అద్భుతం" అని శాస్త్రి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
అయితే, తన కామెంటరీ కెరీర్‌ను శాశ్వతంగా మార్చేసిన ఒక సంఘటనను రవిశాస్త్రి ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్‌లో బీబీసీ, టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కోసం పనిచేసిన తర్వాత, ఆస్ట్రేలియా లెజెండరీ కామెంటేటర్ రిచీ బెనాడ్‌ను ఫీడ్‌బ్యాక్ అడిగినట్లు తెలిపాడు. అప్పుడు ఆయన చెప్పిన ఒక సలహా కామెంటరీపై తన దృక్పథాన్నే మార్చేసిందని శాస్త్రి వివరించాడు.
శాస్త్రి ఆ సంఘటనను వివరిస్తూ.. "రిచీ, నా కామెంటరీ ఎలా ఉందని అడిగాను. దానికి ఆయన, ‘రవీ, నువ్వేం ఆందోళన చెందకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావన్నదానికి కాదు, నీ మాటల్లోని విషయానికి నీకు డబ్బులిస్తారు. టీవీలో చిత్రం చూపించలేని కథను నువ్వు చెప్పలేకపోతే, ఆ చిత్రానికి అదనంగా ఏమైనా జోడించగలిగితేనే మాట్లాడాలి. లేకపోతే నోరు మూసుకోవాలి’ అని చెప్పారు.
ఆ ఒక్క మాట నాకు చాలు. రేడియోలో శ్రోతలకు చిత్రాన్ని మన మాటలతో వర్ణించాలి, కానీ టెలివిజన్‌లో ప్రేక్షకుడు అన్నీ చూస్తాడు. కాబట్టి, తెరపై కనిపిస్తున్న దానికి అదనపు విలువ చేర్చాలి, లేదంటే మౌనంగా ఉండటమే ఉత్తమం అని ఆయన చెప్పారు" అని శాస్త్రి తెలిపారు. రిచీ బెనాడ్ ఇచ్చిన ఆ అమూల్యమైన సలహాయే తనను విజయవంతమైన కామెంటేటర్‌గా నిలబెట్టిందని రవిశాస్త్రి ఉద్ఘాటించారు. కెరీర్ ఆరంభంలో నేర్చుకున్న పాఠాలు ఒక వ్యక్తి ప్రయాణాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి శాస్త్రి అనుభవమే నిలువెత్తు నిదర్శనం.