- క్రోసూరులో జనసేన అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావుకు 30,273 ఓట్ల మెజార్టీ
- రాష్ట్రంలోనే అత్యధిక ఆధిక్యంగా క్రోసూరు ఫలితం
- మాచవరంలో టీడీపీ అభ్యర్థి కత్తి సరోజినికి 22,882 ఓట్ల మెజార్టీ
- మైలవరంలో టీడీపీ అభ్యర్థి పుత్త బ్రహ్మంకు 21,407 ఓట్ల ఆధిక్యం
- వేంపల్లిలో వైసీపీ అభ్యర్థి శివమ్మకు 19,203 ఓట్ల మెజార్టీ
ఏపీ పరిషత్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయాలు సాధించారు. ప్రత్యర్థులకు అందనంత ఆధిక్యంతో గెలిచి రికార్డులు సృష్టించారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జనసేన అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావు ఏకంగా 30,273 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అత్యధిక మెజార్టీగా నిలిచింది. క్రోసూరు మండలంలో పోలైన 38 వేల ఓట్లలో అత్యధికం ఆయనకే దక్కాయి.
పల్నాడు జిల్లాలోని మాచవరం మండలంలోనూ కూటమి అభ్యర్థి భారీ విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన కత్తి సరోజిని 22,882 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమీప వైసీపీ అభ్యర్థి దొండేటి వెంకాయమ్మపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ అభ్యర్థి పుత్త బ్రహ్మం 21,407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు కడప జిల్లా వేంపల్లిలో వైసీపీ అభ్యర్థి బత్తల వెంకట శివమ్మ 19,203 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో టీడీపీ అభ్యర్థి చేరెడ్డి శ్రీలక్ష్మి 12,616 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.
క్రోసూరులో 30 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో పమిడిపాటి శ్రీనివాసరావు సాధించిన గెలుపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.