- ఖేష్మ ద్వీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు
- దాడులను ట్రంప్ పరిమిత సైనిక చర్యగా అభివర్ణన
- సూజా ప్రాంతంలో రెండు క్షిపణులు పడినట్లు ఇరాన్ మీడియా వెల్లడి
- అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ సైన్యం ప్రకటన
- అమెరికా దిగ్బంధనం, ఆంక్షల ఎత్తివేతకు ఇరాన్ డిమాండ్
ఇరాన్‌పై అమెరికా మరోసారి పరిమిత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ కీలక ద్వీపం ఖేష్మలో వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ఇటీవల ఏర్పాటు చేసిన చిన్నపాటి విమాన విధ్వంసక వ్యవస్థను తమ దళాలు నిమిషాల వ్యవధిలోనే ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌కు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే దాడికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
శుక్రవారం ఖేష్మ ద్వీపంలోని సూజా ప్రాంతంలో రెండు క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ దాడుల వల్ల జరిగిన నష్టంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు, తమ వైమానిక రక్షణ దళాలు అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను ఖేష్మ ద్వీపంపై అడ్డుకుని కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ వాదనను అమెరికా ధ్రువీకరించలేదు.
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇటీవలి రోజుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సోమవారం ఖేష్మ, హెంగమ్ ద్వీపాలతో పాటు బందర్ అబ్బాస్ సమీపంలోనూ పేలుళ్లు సంభవించాయి. ఆ సమయంలో అమెరికా చేపట్టిన చర్యలను రక్షణాత్మక దాడులుగా పేర్కొంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో సైనిక ఘర్షణలు తలెత్తడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.
మరోవైపు, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఆసక్తిగా ఉందని, చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని చెప్పారు. అయితే ఏ అంశాలపై అంగీకారం కుదిరిందన్న వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ మాత్రం అమెరికా తమపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, ఆంక్షలను తొలగించాలని, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని, యుద్ధ నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతోంది. దాడులు నిలిపివేయాలని కూడా డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమయ్యాయంటూ వస్తున్న వార్తలను ఖతార్ తోసిపుచ్చింది. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించే వారికి 20 మిలియన్ డాలర్ల వరకు బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. అణు కేంద్రాలు, పరికరాలు, సంబంధిత వ్యక్తుల వివరాలు అందించిన వారికి ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.