- ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌పై అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక
- చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో ఆయనకు ప్రేమ సంబంధం ఉన్నట్లు ఆరోపణ
- అధునాతన ఏఐ చిప్‌లను చైనాకు తరలించేందుకే ఈ యత్నమని అనుమానం
- ఆరోపణలను ఖండించిన ఎన్విడియా, చైనా.. నిరాధారమని వెల్లడి
- వివరణ ఇవ్వాలని జెన్సెన్ హువాంగ్ను కోరిన అమెరికా కాంగ్రెస్ కమిటీలు
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంటోంది. చైనా కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళతో ఆయనకు ప్రేమ సంబంధం ఉందని అమెరికా నిఘా వర్గాలు రూపొందించిన ఒక మెమో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ నివేదిక ఆధారంగా 'ఫైనాన్షియల్ టైమ్స్' ప్రచురించిన కథనంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం అమెరికా టెక్, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది ప్రారంభంలో కొద్దిమంది ఉన్నతాధికారుల మధ్య ఒక రహస్య మెమో సర్క్యులేట్ అయింది. అందులో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు, చైనాకు చెందిన వ్యాపారవేత్త అలిస్ హువాంగ్ (హువాంగ్ లే)తో సంబంధాలున్నట్లు పేర్కొన్నారు.
సింగపూర్ కేంద్రంగా పనిచేసే మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ సంస్థలో ఆమె ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఎన్విడియాకు కస్టమర్‌గా ఉంది. అయితే, అలిస్ హువాంగ్ను చైనా ప్రధాన గూఢచర్య సంస్థ ‘మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ’ తమ ఏజెంట్‌గా నియమించుకుందని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.
అధునాతన ఎన్విడియా ఏఐ చిప్‌లను అమెరికా ఆంక్షలను దాటి చైనాకు అక్రమంగా తరలించేందుకు అలిస్ హువాంగ్ ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే ఆమె జెన్సెన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నారని గతంలో న్యూయార్క్ టైమ్స్ సైతం ఒక కథనాన్ని ప్రచురించింది.
తాజా నిఘా నివేదిక ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య శిఖరాగ్ర సదస్సుకు కొద్ది రోజుల ముందు ఈ మెమోను అధికారులు పంచుకున్నట్లు సమాచారం.
ఆరోపణలను ఖండించిన ఎన్విడియా, చైనా
అయితే, ఈ ఆరోపణలను ఎన్విడియా సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ సీఈఓ జెన్సెన్ హువాంగ్ ప్రతి ఏటా వేలాది మంది కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌లను కలుస్తుంటారని, అందులో భాగంగానే మెగాస్పీడ్ ప్రతినిధులతోనూ సమావేశమయ్యారని తెలిపింది. ఆయనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.
గతంలో చిప్‌ల తరలింపునకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ జరిపి, అవి నిరాధారమని తేల్చినట్లు గుర్తుచేసింది. మరోవైపు, చైనా విదేశాంగ శాఖ కూడా ఈ వార్తలను కొట్టిపారేసింది. బీజింగ్‌పై బురద జల్లేందుకే ఇటువంటి నిరాధారమైన ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
వివరణ కోరిన కాంగ్రెస్ కమిటీలు
ఈ వివాదం తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. ముగ్గురు హౌస్ రిపబ్లికన్ కమిటీ ఛైర్మన్లు ఈ నివేదికపై స్పందించారు. జెన్సెన్ హువాంగ్‌కు చైనా గూఢచారితో ఉన్న సంబంధాలు, విదేశీ గూఢచర్యం నుంచి కంపెనీ భద్రతా ప్రోటోకాల్స్‌పై తమకు వివరణ ఇవ్వాలని కోరారు. కాగా, అలిస్ హువాంగ్ గూఢచర్య కార్యకలాపాల గురించి జెన్సెన్ హువాంగ్‌కు తెలిసిందనడానికి ఎలాంటి ఆధారాలు బహిరంగంగా అందుబాటులో లేవని నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారం ఎన్విడియా సంస్థకు, అమెరికా-చైనా సంబంధాలకు ఇబ్బందికరంగా మారింది.