- యల్లనూరు, పుట్లూరు, యాడికి ఘటనలపై స్పందించిన ప్రభాకర్‌రెడ్డి
- అనవసర వివాదాలతో కార్యకర్తలే నష్టపోతారని వ్యాఖ్య
- ఘర్షణల్లో నష్టపోయిన వారికి క్షమాపణ చెప్పిన మాజీ ఎమ్మెల్యే
రాజకీయ గొడవల్లో నష్టపోయేది కింది స్థాయి కార్యకర్తలేనని, తమ లాంటి నాయకులు ఎప్పుడూ బాగానే ఉంటారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనవసర వివాదాలతో కార్యకర్తలే నష్టపోతారని, ఈ విషయం గుర్తించి గొడవల జోలికి వెళ్లవద్దని ఆయన హితవు పలికారు. తాడిపత్రిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత వారంలో యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో జరిగిన సంఘటనలను ఆయన ప్రస్తావించారు. ఈ ఘర్షణల వల్ల నష్టపోయింది కార్యకర్తలేనని గ్రహించాలని, ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల జరిగిన గొడవల్లో నష్టపోయిన వారికి ఎన్నికలు ముగిసిన తర్వాత తన వంతుగా చేతనైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా యల్లనూరు, పుట్లూరు మండలాల్లో జరిగిన ఘటనల్లో నష్టపోయిన వారికి ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు తెలిపారు. ఆ రెండు మండలాల్లో ఫ్యాక్షనిజం పూర్తిగా నశించి, అభివృద్ధి పథంలో పయనించాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.