- తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు బాపట్ల చేరుకున్న సీఎం
- ఏరియల్ సర్వే ద్వారా మరోసారి నష్టాన్ని అంచనా వేసిన చంద్రబాబు
- జిల్లెలమూడి వద్ద డ్రెయిన్ల నష్టంపై అధికారులతో సమీక్ష
- రేటూరులో రైతులతో మాట్లాడి, మునిగిన పంటలను పరిశీలించనున్న సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం బాపట్ల జిల్లాకు చేరుకున్నారు. అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన, మార్గమధ్యంలో ఏరియల్ సర్వే ద్వారా తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను మరోసారి పరిశీలించారు. అనంతరం సూర్యలంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయ్యారు.
ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో బాపట్ల మండలం జిల్లెలమూడి వంతెన వద్దకు బయలుదేరారు. అక్కడ తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న డ్రెయిన్లను పరిశీలించి, వాటి పునరుద్ధరణ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి పత్తిపాడు నియోజకవర్గంలోని రేటూరు గ్రామానికి వెళతారు. ఆ గ్రామంలో తుపాను కారణంగా నీట మునిగిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి భరోసా ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి, సహాయక చర్యలను వేగవంతం చేయడంపై ఈ పర్యటనలో సీఎం దృష్టి సారించారు.