- రెండో వన్డే వెల్లింగ్టన్‌లో.. వర్షం ముప్పు
- నేడు వర్షం కారణంగా ప్రాక్టీస్ రద్దు
- మ్యాచ్ సమయంలో 55-60 శాతం వర్ష సూచన.
- ఆట ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం
- రాత్రి వేళ మళ్లీ పెరగనున్న వర్ష సూచన
భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. తొలి వన్డేలో వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం కలగ్గా.. రెండో మ్యాచ్‌కూ అదే ముప్పు పొంచి ఉంది. శనివారం వెల్లింగ్టన్‌లో జరిగే ఈ పోరుకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. దీంతో అభిమానులు పూర్తి మ్యాచ్ చూడగలరా? అన్న సందేహం నెలకొంది.
శుక్రవారం ఉదయం నుంచే వెల్లింగ్టన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లకు ఆటంకం ఏర్పడింది. మ్యాచ్ జరిగే హెచ్‌ఎన్ఆర్‌వై స్టేడియంలో కాకుండా బేసిన్ రిజర్వ్‌లో ప్రాక్టీస్ చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా న్యూజిలాండ్ జట్టు ఇండోర్ వేదికకు మారింది. భారత జట్టు మాత్రం ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిగా రద్దు చేసుకుంది.
యాక్యువెదర్ అంచనాల ప్రకారం శనివారం వెల్లింగ్టన్‌లో వర్షం పడే అవకాశం 60 శాతంగా ఉంది. ఉదయం కూడా ఇదే స్థాయిలో వర్ష సూచన ఉండగా.. మధ్యాహ్నం తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశముంది. స్థానిక సమయం మధ్యాహ్నం 12 గంటలకు వర్షం పడే అవకాశం 5 శాతం, ఒంటి గంటకు 8 శాతంగా ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఈ అవకాశం ఒక్కసారిగా 49 శాతానికి పెరుగుతుంది. మ్యాచ్ మొదలయ్యే 3 గంటలకు 55 శాతం, సాయంత్రం 4 గంటలకు 60 శాతంగా అంచనా వేశారు. దీంతో ఆట ప్రారంభం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.
సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య వర్ష సూచన కొంత తగ్గినా.. రాత్రి 8 గంటల తర్వాత మళ్లీ పెరిగే అవకాశముంది. రాత్రి 10 గంటలకు 51 శాతం వరకు వర్ష సూచన ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆక్లాండ్‌లో బుధవారం జరిగిన తొలి వన్డేలోనూ వర్షం పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించింది. తొలుత న్యూజిలాండ్‌ను 185 పరుగులకే కట్టడి చేసిన భారత్.. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించారు. భారత్ 22.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో వన్డే కూడా వర్షం నీడలో సాగనుండటంతో మ్యాచ్ ఫలితంపై ఆసక్తి నెలకొంది.