- 11 కంపార్ట్మెంట్లలో వేచిచూస్తున్న భక్తులు
- టోకెన్ లేనివారికి సర్వదర్శనానికి 8 గంటల సమయం
- డిసెంబర్ 20 నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఉదయం నాటికి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గురువారం ఒక్కరోజే 65,218 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 20,213 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా నమోదైంది.
మరోవైపు, ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సమీక్షలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, తొలి మూడు రోజులు (డిసెంబర్ 20-22) ఆన్లైన్ ఈ-డిప్ విధానంలో ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించనున్నారు. మిగిలిన ఏడు రోజులు (డిసెంబర్ 23-29) పూర్తిగా సర్వదర్శనం భక్తులకు అనుమతిస్తారు. డిసెంబర్ 25వ తేదీన అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.