- విజయవాడలో తగ్గనున్న రైళ్ల నిరీక్షణ.. కృష్ణా నదిపై కొత్త వంతెన
- బల్లార్ష-గూడూరు ప్రాజెక్టులో ముందడుగు.. విజయవాడలో కొత్త రైల్వే బ్రిడ్జి
- నదిపై 1.30 కిలోమీటర్ల పొడవుతో మూడో వంతెన
విజయవాడలో రైల్వే ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా రైల్వే శాఖ కీలక ముందడుగు వేసింది. నగరంలో కృష్ణా నదిపై కొత్తగా మరో రైల్వే వంతెన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బల్లార్ష-ఖాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నిర్మిస్తున్న నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.5,858 కోట్ల అంచనాలతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వే బోర్డుకు సమర్పించారు.
విజయవాడ-గూడూరు మధ్య 293 కిలోమీటర్ల మేర నిర్మించనున్న నాలుగో లైన్ ప్రాజెక్టులో ఈ కొత్త వంతెన అత్యంత కీలకం కానుంది. విజయవాడ జంక్షన్-కృష్ణా కెనాల్ జంక్షన్ స్టేషన్ల మధ్య, సీతానగరం వద్ద ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఇక్కడ కృష్ణా నదిపై రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి. ఒకటి డబుల్ లైన్తో, మరొకటి సింగిల్ లైన్తో సేవలందిస్తున్నాయి. ఇప్పుడు వీటికి పక్కనే నదిపై 1.30 కిలోమీటర్ల పొడవుతో మూడో వంతెనను నిర్మించనున్నారు.
ఈ కొత్త వంతెన నిర్మాణం పూర్తయితే రైళ్ల రాకపోకల్లో జాప్యం గణనీయంగా తగ్గనుంది.
ముఖ్యంగా తెనాలి, గుంటూరు మార్గాల నుంచి విజయవాడ వచ్చే రైళ్లు కృష్ణా కెనాల్ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా, ఉత్తరాది రాష్ట్రాల నుంచి విజయవాడ మీదుగా తమిళనాడు వైపు వెళ్లే గూడ్స్ రైళ్లు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ రైల్వే బోర్డు ఆమోదం కోసం వేచి చూస్తోంది.