- పాక్ పౌరులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లకు వర్తించనున్న మినహాయింపులు
- పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మైనారిటీలకు కూడా ఊరట
- నిబంధనల నుంచి మినహాయింపు పొందినవారు వీసా తీసుకోవడం తప్పనిసరి
- భారత్, నేపాల్, భూటాన్ మధ్య ప్రయాణ నిబంధనల్లోనూ మార్పులు
భారత్‌లో నివసిస్తున్న పలు కేటగిరీలకు చెందిన విదేశీ పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పాకిస్థానీ పౌరులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు, మైనారిటీ శరణార్థుల సహా పలువురికి పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ (మినహాయింపు) (సవరణ) ఆర్డర్-2026'ను గెజిట్‌లో ప్రచురించింది.
తాజా నిబంధనల ప్రకారం.. శాశ్వతంగా స్థిరపడే ఉద్దేశంతో 2009 డిసెంబర్ 31 లేదా అంతకుముందు భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ పౌరులకు పాస్‌పోర్ట్ పునరుద్ధరణ నుంచి మినహాయింపు ఇచ్చారు. పాకిస్థాన్ జారీ చేసే కంప్యూటరైజ్డ్ జాతీయ గుర్తింపు కార్డు (CNIC) లేని కారణంగా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించుకోలేని వారికి ఈ వెసులుబాటు కల్పించారు. అయితే, వీరంతా భారత్‌లో నివాసం కొనసాగించడానికి తప్పనిసరిగా సరైన వీసా పొందాల్సి ఉంటుంది.
ఇదే తరహా మినహాయింపును మరికొందరికి కూడా వర్తింపజేశారు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లి, 2009 డిసెంబర్ 31 నాటికి భారత్‌కు తిరిగివచ్చి కేరళలో స్థిరపడిన కొందరు ముస్లిం పురుషులకు ఈ సడలింపు వర్తిస్తుంది. అలాగే, మలేషియా లేదా సింగపూర్ పౌరసత్వం పొంది, ఆ దేశాల పాస్‌పోర్టులతో 2009 డిసెంబర్ 31 లోపు భారత్‌కు తిరిగి వచ్చిన భారత సంతతి వ్యక్తులకు కూడా ఇది వర్తిస్తుంది. వారి పాస్‌పోర్టుల గడువు ముగిసి, పునరుద్ధరణకు వీలులేని పక్షంలో ఈ మినహాయింపు లభిస్తుంది.
వీరితో పాటు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి 2024 డిసెంబర్ 31 నాటికి భారత్‌లో ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రిస్టియన్ వర్గాల వారికి కూడా పాస్‌పోర్ట్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించినా లేదా వారి పత్రాల గడువు ముగిసినా ఈ సడలింపు వర్తిస్తుంది. వీరు కూడా దేశంలోకి ప్రవేశించాక, ఇక్కడ నివసించడానికి వీసా తీసుకోవడం తప్పనిసరి.
ఇదే ఉత్తర్వుల ప్రకారం 2015 జనవరి 9కి ముందు భారత్‌లో ఆశ్రయం పొందిన శ్రీలంక తమిళ శరణార్థులకు, భారత రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రత్యేక ఎంట్రీ పర్మిట్లపై దేశంలోకి వచ్చిన టిబెటన్లకు కూడా పాస్‌పోర్ట్, వీసా నిబంధనల నుంచి మినహాయింపు కల్పించారు.
మరోవైపు, భారత్, నేపాల్, భూటాన్ పౌరుల మధ్య ప్రయాణ నిబంధనలను కూడా ఈ ఉత్తర్వుల్లో సవరించారు. ఈ మూడు దేశాల పౌరులు తమ మధ్య భూమార్గంలో గానీ, విమాన మార్గంలో గానీ ప్రయాణించేటప్పుడు పాస్‌పోర్ట్‌కు బదులుగా ప్రభుత్వం నిర్దేశించిన ఏదైనా గుర్తింపు పత్రం చూపిస్తే సరిపోతుంది. అయితే, నేపాల్, భూటాన్ పౌరులు చైనా, మకావు, హాంగ్‌కాంగ్ లేదా పాకిస్థాన్ మీదుగా ప్రయాణిస్తే మాత్రం తప్పనిసరిగా పాస్‌పోర్ట్‌తో పాటు వీసా కూడా కలిగి ఉండాలని స్పష్టం చేశారు.