- ఓటు వేయడానికి వెళ్లిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గృహనిర్బంధం
- కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టులు చేస్తోందన్న వైసీపీ
- రిగ్గింగ్ కోసమే మండలాల్లో ముఖ్య నేతల అరెస్ట్ అని ఆరోపణ
నంద్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తన సొంత గ్రామమైన పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రికి వెళ్లిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ పరిణామంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నందికొట్కూరు వైసీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కేవలం ఓటు వేయడానికి వెళ్లిన తమ నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. కూటమి నాయకులు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోవాలనే దురుద్దేశంతోనే ప్రతి మండలంలో 5 నుంచి 10 మంది వైసీపీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేసి, వారి గ్రామాలకు పంపకపోతే జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని సుధీర్ హెచ్చరించారు. ముచ్చుమర్రిలో సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, అక్కడే ఉన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అప్రజాస్వామిక చర్యలకు కూటమి ప్రభుత్వం వడ్డీతో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.