- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
- మైలవరం నియోజకవర్గం నాగులూరులో ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ అభ్యర్థి
- జోగి రమేశ్, మండల స్థాయి నేతలు సహకరించడం లేదని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ, ఎన్టీఆర్ జిల్లాలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. మైలవరం నియోజకవర్గంలోని నాగులూరులో వైసీపీ అభ్యర్థి ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం స్థానికంగా కలకలం రేపింది. మంత్రి జోగి రమేష్, మండల స్థాయి నాయకుల నుంచి తనకు ఎలాంటి సహకారం అందడం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో నాగులూరు వైసీపీ అభ్యర్థి, తన గ్రామ పార్టీ వాట్సాప్ గ్రూపులో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఓ సందేశం పెట్టారు. స్థానిక నేతల నుంచి మద్దతు కొరవడటంతోనే తాను బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామం నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కీలకమైన ఎన్నికల సమయంలో సొంత పార్టీ అభ్యర్థే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.