- ఆయన మృతి పట్ల చంద్రబాబు, నారా లోకేశ్ విచారం
- శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడిన చంద్రబాబు
- పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేశారన్న లోకేశ్
- చక్రపాణి కుటుంబ సభ్యులకు ఇరువురు నేతల ప్రగాఢ సానుభూతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఏ. చక్రపాణి కన్నుమూశారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్త హృదయులైన ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చక్రపాణి మృతి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు. శాసనమండలి ఛైర్మన్గా ఆయన అందించిన సేవలు, శాసన వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను కాపాడటంలో చూపిన నిబద్ధత చిరస్మరణీయమని కొనియాడారు. మండలి ఛైర్మన్గా శాసన వ్యవస్థపై ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నారా లోకేశ్ సైతం చక్రపాణి మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చక్రపాణి ఎంతో నిబద్ధతతో ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.