- ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్
- టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఓటు వేసిన వీరాంజనేయ స్వామి
- వైసీపీ నేతలను జగన్ బలవంతంగా ఎన్నికల బరిలో నిలబెట్టారని విమర్శ
ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏకపక్షంగా కూటమి పార్టీలకు ఓట్లు వేస్తున్నారని మంత్రి తెలిపారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ బలవంతంగా ఆ పార్టీ నాయకులను ఎన్నికల బరిలో నిలబెట్టారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయామని వైసీపీ అభ్యర్థులే వాపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు చూసైనా ఆ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 28 జెడ్పీల్లో 582 జడ్పీటీసీ స్థానాలకు, 659 ఎంపీపీల్లో 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 4.8 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 9.44 శాతం, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.38 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.