- నందన్ నీలేకని నేతృత్వంలోని హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ బృందంతో చంద్రబాబు భేటీ
- అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతో సంస్కరణలు చేపట్టాలని సీఎం సూచన
- విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా పరీక్షల విధానం ఉండాలన్న మంత్రి లోకేశ్
- పరీక్షల నిర్వహణలో సాంకేతికత వినియోగంపై దృష్టి సారించామన్న నీలేకని
- ఏపీలో అమలవుతున్న టెక్నాలజీ విధానాలపై టాస్క్ ఫోర్స్ ఆసక్తి
భారతదేశంలోని విభిన్న రాష్ట్రాలు, విభిన్న భాషల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా సంస్కరణలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఏకాభిప్రాయంతో అత్యంత పారదర్శకమైన, విశ్వసనీయమైన జాతీయ పరీక్షా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థికైనా, ఏ భాష మాట్లాడే వారికైనా న్యాయం జరిగేలా ఈ సంస్కరణలు రూపుదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
బుధవారం అమరావతి సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ సందర్భంగా సచివాలయానికి విచ్చేసిన నీలేకనికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు.
ఈ భేటీలో టాస్క్ ఫోర్స్‌కు పలు కీలక సూచనలు చేసిన చంద్రబాబు, నేటి తరం విద్యార్థులు, యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరీక్షల విధానంలో మార్పులు రావాలని అన్నారు. విద్య కేవలం పరీక్షలు, మార్కులకే పరిమితం కాకూడదని, విద్యార్థులలో నైపుణ్యాలు, సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గాలి: మంత్రి లోకేశ్
ఈ సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, దేశవ్యాప్తంగా పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడిని తగ్గించేలా పరీక్షల విధానాన్ని సరళీకరించాలని సూచించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విద్య, ఉద్యోగాల కోసం వెళ్లేటప్పుడు భాష, విద్యా విధానం, ధ్రువీకరణ పత్రాల పరంగా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ వినియోగం గురించి వివరిస్తూ, రాష్ట్రంలో 'డేటా లేక్' ద్వారా వివిధ రంగాల సమాచారాన్ని ఒకేచోట సమీకరించి, మెరుగైన పాలనా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
పరీక్షల విధానంలో సమూల మార్పులే లక్ష్యం: నందన్ నీలేకని
అనంతరం టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ నందన్ నీలేకని మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలను పూర్తిగా అరికట్టడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడంపై తాము ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తున్నామని వివరించారు.
ఈ సంస్కరణల రూపకల్పనలో భాగంగా తాము వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామని, ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్కరణలపై అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికతను వినియోగించి అమలు చేస్తున్న విధానాలపై ఆయన ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశారు.