- ఢిల్లీలోని మంగోల్పురిలో ఘటన
- చెప్పుల ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో నలుగురు మృతి
- మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఆరుగురిని కాపాడిన సిబ్బంది
- రబ్బరు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని అంచనా
- ప్రమాద కారణాలపై పోలీసుల దర్యాప్తు ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగోల్‌పురి ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో రాత్రి చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒక పాదరక్షల తయారీ పరిశ్రమ బేస్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న మరో ఆరుగురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో పాదరక్షల తయారీకి వినియోగించే రబ్బరు నిల్వలు భారీగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.