- రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన
- పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి
- బాలిక ముఖం, తల, వీపుపై తీవ్ర గాయాలు
- అడ్డుకునేందుకు వెళ్లిన మరో విద్యార్థినికి గాయాలు
- బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స
అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ వ్యక్తి చెట్లను కోసే ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
పాఠశాలలోకి వచ్చిన నిందితుడు విద్యార్థినిపై ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆమెపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
స్కూల్‌లో కొన్ని మరమ్మతు పనులు జరుగుతున్నాయని హెడ్ మాస్టర్ తెలిపారు. నిందితుడు స్కూల్లోకి వస్తున్న సమయంలో ఉపాధ్యాయులు గమనించినప్పటికీ.. వర్కర్ అనుకున్నామని వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు తరగతి గదిలో టీచర్ ఉన్నట్లు తెలిపారు. దాడి చేసిన వ్యక్తికి 25-30 ఏళ్ల వయసు ఉండొచ్చని అంచనా వేశారు. సరిగా గమనించే లోపే ఉన్మాది పారిపోయినట్లు పేర్కొన్నారు.