తమిళనాడు సీఎం విజయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ (92) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అమల్ రాజశేఖరన్, విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ అన్నయ్య అయిన రాజశేఖరన్ భార్య. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నప్పటికీ, వారంతా విదేశాల్లో స్థిరపడటంతో ఆమె చెన్నైలోని నీలాంకరైలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

పెద్దమ్మ మరణ వార్త తెలియగానే శుక్రవారం నటుడు విజయ్, ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్, తల్లి శోభ వృద్ధాశ్రమానికి వెళ్లి అమల్ రాజశేఖరన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.