- 59 ఏళ్ల వయసులో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత
- అక్టోబర్ 30న బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయం
- మరణవార్తను ధ్రువీకరించిన దర్శకుడు అశోక్ పండిట్
- 1994లో ‘ఆతిష్’తో సినీ ప్రయాణం ప్రారంభం
- ‘కాంటే’, ‘కాబిల్’తో దర్శకుడిగా గుర్తింపు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా (59) కన్నుమూశారు. అక్టోబర్ 30న రాత్రి బాత్‌రూమ్‌లో జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దర్శకుడు అశోక్ పండిట్ కూడా సంజయ్ గుప్తా మరణవార్తను ధ్రువీకరించారు. ఇంట్లో తలకు గాయమవడంతో ఆయన మృతి చెందారని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. సంజయ్ గుప్తా మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని సంతాపం తెలిపారు.
1994లో ఆదిత్య పంచోలీ, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆతిష్: ఫీల్ ద ఫైర్’ సినిమాతో సంజయ్ గుప్తా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రామ్ శాస్త్ర’, ‘ఖౌఫ్’, ‘జంగ్’ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు రచయితగా, నిర్మాతగానూ వ్యవహరించారు. ‘కాంటే’, ‘కాబిల్’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సంజయ్ దత్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. వీరిద్దరి కలయికలో ‘కాంటే’, ‘ముసాఫిర్’, ‘జిందా’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’ వంటి చిత్రాలు వచ్చాయి. ‘జిందా’ దక్షిణ కొరియా సినిమా ‘ఓల్డ్‌బాయ్’కు అనధికారిక రీమేక్. ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’, ‘దస్ కహానియాన్’ చిత్రాలను నిర్మించిన ఆయన.. ‘షూటౌట్ ఎట్ వడాలా’కు దర్శకత్వం వహించి సహ నిర్మాతగానూ వ్యవహరించారు.
ఆయన చివరి చిత్రం ‘ది మిరాండా బ్రదర్స్’ 2025లో విడుదలైంది. హర్షవర్ధన్ రాణే, మీజాన్ జాఫ్రీ నటించిన ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకత్వం వహించి నిర్మించారు.