- రాజస్థాన్ యువకుడి ఖాతాలో రూ. 10,000 కోట్లు జమ
- ఫోన్ రీఛార్జ్ కోసం యాప్ తెరిచి షాకైన సమీర్ ఖాన్
- సొంత డబ్బులు కూడా ఫ్రీజ్ అవడంతో పోలీసులకు ఫిర్యాదు
- సాంకేతిక లోపమని చెప్పిన బ్యాంకు.. సమస్య పరిష్కారం
రాజస్థాన్‌లో ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. నెలకి పది వేల రూపాయల జీతం తీసుకునే అతని అకౌంట్‌లో ఏకంగా రూ. 10,000 కోట్లు వచ్చి పడ్డాయి. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాంకు ఆ ఖాతాను వెంటనే స్తంభింపజేయడంతో తన సొంత డబ్బులు కూడా వాడుకోలేని పరిస్థితి ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. సికార్‌లోని సలాసర్ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న నిర్మల్ మెడికల్ పాయింట్‌లో సమీర్ ఖాన్ (22) అనే యువకుడు పనిచేస్తున్నాడు. బుధవారం తన ఫోన్ రీఛార్జ్ చేసుకునేందుకు బ్యాంకింగ్ యాప్ తెరిచాడు. బ్యాలెన్స్ సున్నా చూపించడంతో కంగారుపడి వివరాలు చెక్ చేయగా, తన ఖాతాలో రూ. 10,000 కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకు నిలిపివేసినట్టు (లీన్) గుర్తించాడు. దీంతో అకౌంట్‌లోని తన సొంత డబ్బు రూ. 55,000 కూడా ఫ్రీజ్ అయిపోయింది.
వెంటనే ఈ విషయాన్ని తన యజమాని ధీరజ్ శర్మకు చెప్పి, ఇద్దరూ కలిసి సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల సూచనతో బ్యాంకు అధికారులను సంప్రదించగా, సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని వారు తెలిపారు. "నా అకౌంట్‌లో రూ. 55,000 ఉండగా, రూ. 10,000 కోట్ల లీన్ విధించారు. నా డబ్బులు కూడా వాడుకోలేకపోయాను. పోలీసులకు, బ్యాంకుకు చెప్పడంతో సమస్య పరిష్కారమైంది" అని సమీర్ ఖాన్ చెప్పాడు. అనంతరం బ్యాంకు ఆ సాంకేతిక లోపాన్ని సరిచేసి, సమీర్ అసలు బ్యాలెన్స్‌ను పునరుద్ధరించడంతో ఈ గందరగోళానికి తెరపడింది.